30-11-2024 06:27:43 PM
జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ కె.యువరాజ
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జైలు జీవితం అనంతరం సత్ ప్రవర్తనతో మేలగాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ కే. యువరాజ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలు ను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనంత లక్ష్మితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల యోగక్షేమాలు, ఖైదీల రోజువారి దినచర్య, వసతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్షణికావేశంలో తెలిసి తెలియక చేసిన తప్పులతో కుటుంబ సభ్యులకు దూరమవడం జరుగుతుందన్నారు. మొదటిసారి చేసిన తప్పులు పునరావృతం కాకుండ చూసుకోవాలన్నారు. సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచితంగా పొందవచన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిటెడెంట్ ప్రేమ్ కుమార్, లీగల్ సర్వీసెస్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.