30-11-2024 06:31:46 PM
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా శనివారం పద్మకల్యాణ్ నేతృత్వంలో "శంభు కింకిణి" నృత్యోత్సవం నిర్వహించారు. అరుణ స్వరూప్ కూచిపూడి నృత్య ప్రదర్శనలో మండోదరి శబ్దం, ఎంతచక్కని వాడే, జావళి, డెబీజాని బసు కథక్ నృత్య ప్రదర్శనలో శివ స్తుతి, తీన్ తాల్, తుమ్రి, తులసి దాస్ భజన్, శ్రోబన మిత్ర దాస్ మణిపురి నృత్య ప్రదర్శనలో సెలబ్రేషన్ అఫ్ లైఫ్ అండ్ వుమెన్ వుడ్ కుమారి సాయి మనస్విని ఆంధ్రనాట్యం ప్రదర్శనతో కళాకారులందరూ ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రత్న శ్రీ అస్సోసియేటివ్ ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ, మధు ప్రోగ్రాము ఎగ్జిక్యూటివ్ దూరదర్శన్, డాక్టర్ రుద్రవరం సుధాకర్, అస్సోసియేటివ్ ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ రొయ్యురు, శేషసాయి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ ముఖ్య అతిధులుగా విచ్చేసి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నా కళాకారులను అభినందించారు.