04-01-2026 12:39:49 AM
టీజీవో నేతలకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హామీ
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా నని టీజీవో నాయకులకు రెవెన్యూ ము ఖ్యకార్యదర్శి, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు హామీ ఇచ్చారు. శనివారం తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధానకార్యదర్శి బి.శ్యామ్ నేతృ త్వంలో శనివారం కమిషనర్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
డిపార్ట్‌మెంట్ పునర్వ్యవస్థీకరణ, ఖాళీగా ఉన్న సీటీవో పోస్టులకు ఇన్‌చార్జీలుగా సీనియర్ డీసీటీవోలను నియమిం చాలని, డీసీటీవో స్థాయి నుంచి జాయింట్ కమిషనర్ స్థాయి వరకు సీనియారిటీ లిస్టులు ఫైనల్ చేసి డీపీసీ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవో గెజిటెడ్ ఆఫీసర్స్ సీటీ ఫోరమ్ కన్వీనర్ డీ కిషన్‌ప్రసాద్, కోకన్వీనర్ ఎస్ మధుసూదనాచారి పాల్గొన్నారు.