21 August, 2026 | 9:36 AM

కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ

14-06-2024 02:25 PM

హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ శుక్రవారం కొనసాగుతోంది. ఈఎన్సీ జనరల్ కార్యాలయం, ఓఅండ్ఎం విభాగాల ఇంజినీర్ల విచారణ జరుగుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధిం చిన అంశాలపై విచారిస్తున్నారు. ఇంజినీర్లకు సంబంధించి దాదాపుగా విచారణ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రాణహితా- చేవెళ్లపై విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీస్తున్నారు. ఆ నివేదిక పక్కన పెట్టడంపై పీసీ ఘోష్ విచారిస్తున్నారు.

కాళేశ్వరం ఎందుకు చేపట్టారన్న విషయమై ఆరా తీశారు. గోదావరిలో నీరున్నా ప్రాణహిత నుంచి ఎత్తిపోయడంపై కమిషన్ ఆరా తీసింది. తుది నివేదిక ఇవ్వాలని ఎన్ డీఎస్ ఏ నిపుణుల కమిటీకి కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ప్లానింగ్ పై పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ నుంచి కమిషన్ నివేదిక కోరింది. జులై మొదటి వారంలో నివేదికలు వచ్చే అవకాశముంది. జస్టిస్ పీసీ ఘోష్ విజిలెన్స్ విభాగం నుంచి కూడా తుది నివేదిక కోరారు. ఈ నెల 27 లోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక పూర్తిస్థాయిలో విచారిస్తామని ఆయన పేర్కొన్నారు.