ఓటర్ల జాబితా సవరణకు 3 రోజులే గడువు
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి): జిల్లాలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందని, ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఆగస్టు 10 వరకు మాత్రమే గడువు ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి తెలిపారు.శుక్రవారం సర్ ఓటర్ ప్రక్రియను ఆయన పరిశీలించి స అధికారులతో వివరాలుతీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ సరిచూసుకోవడానికి లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవ డానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నందున, ప్రజలు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే స్పందించాలని కోరారు. ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన పౌరులు వెంటనే తమ పరిధిలోని బూత్ లెవల్ అధికారులకు పూర్తి చేసిన ఫారాలను అందజేయాలి.
ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు కూడా తమ పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలు సరై నవో కాదో ఒకసారి సరిచూసుకోవాలి. త ప్పులుంటే సవరణల కోసం ధరఖాస్తు చేసుకోవాలి. తప్పులు లేని పారదర్శకమైన ఓ టరు జాబితాను రూపొందించేందుకే ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వ హిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు.అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈఅర్‌ఓ, ఏఈఅర్‌ఓ మరియు బీఎల్‌ఓ లుకార్యాలయ వేళల్లో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని, చివరి రోజైన ఆగస్టు 10న రద్దీ నివారించేందుకు త్వరగా ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.






