బాగా చదివితేనే మంచి భవిష్యత్తు
10-01-2026 12:54 PM
హన్వాడ : బాగా చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని హన్వాడ మండల కేంద్రం లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మండల స్థాయి క్రీడా పోటీలలో నిర్వహించినటువంటి క్విజ్ పోటీలను నిర్వహించారు. మొదటి విజేతగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, రెండవ విజేతగా శ్రీ విద్యా విజ్ఞాన్ మందిర్ ఉన్నత పాఠశాల మూడో విజేతగా కొత్తపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఘనవిజయం సాధించాయి. ఈ కార్యక్రమంలో హన్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, బిజెపి మండల కమిటీ సభ్యులు, హన్వాడ మండల BJYM కమిటీ సభ్యులు ఉన్నారు.






