10-01-2026 12:52:45 PM
వేములవాడ, జగిత్యాల ట్రాఫిక్ మళ్లింపు
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా మరమ్మత్తులు జరుగుతున్నాయి. దీంతో వేములవాడ జగిత్యాల ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపివేసి, వాహనాలను చెక్కపల్లి ఎదురుగట్ల నూకలమర్రి మార్గం గుండా మళ్లించారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు, జగిత్యాల వైపు వెళ్లేవారు నూకలమర్రి రహదారి ఉపయోగించాలని అధికారులు సూచించారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.