calender_icon.png 11 January, 2026 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా అమ్మినా, ఉపయోగించిన కఠిన చర్యలు

10-01-2026 12:56:17 PM

మద్నూర్ ఎస్సై రాజు

మద్నూర్, (విజయక్రాంతి): మద్నూర్ డోంగ్లీ  ఉమ్మడి మండల వ్యాపారులు చైనా మాంజా అమ్మినా, ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని మద్నూర్ ఎస్సై రాజు  వెల్లడించారు. శనివారం మద్నూర్ మండల కేంద్రంలోని  పలు కిరాణా షాపులను సిబ్బంది తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై  మాట్లాడుతూ... ఎవరైనా చైనా మాంజ అమ్మినా, ఉపయోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ చైనా మంజా వాడకం ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, పక్షిజీవులకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోందన్నారు. మంజా పదునుగా ఉండటం వలన ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తుల మెడ, చేతులు తీవ్రంగా గాయపడి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చైనా మంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడిందని, ఉపక్రమిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎవరైనా చైనా మాంజా అమ్మిన కలిగి ఉన్నట్లయితే సమాచారం అందించాలన్నారు.అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.