26 August, 2026 | 2:41 AM

మెట్ట పంటలనే సాగు చెయ్యాలి

26-08-2026 12:00 AM

శాస్త్రవేత్త శ్రీధర్

దామరచర్ల, ఆగస్టు 25: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి అవసరం ఉన్న మెట్ట పంటల సాగు చేయాలని కెవికె శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ అన్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మల ఆధ్వర్యంలో మండలంలో మండలంలోని కొండ్రపోల్ రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన ఆర్ పి ఎల్ ఆధారిత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని వరి కి ప్రత్యా మ్నాయంగా తక్కువ నీటి అవసరం ఉన్న మెట్ట పంటల సాగు చేయాలని కోరారు. మెట్ట పంట లు స్థానిక పరిస్థితులను బట్టి ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు. ముఖ్యంగా మెట్ట పంటలైన కంది, పెసర ,మినుము నువ్వులు, జొన్న , సజ్జ ,ఆముదం ,ఉలువలు వంటి పంటలు సాగు చేయాలని చెప్పారు.

నానో యూరియా నానో డిఏపి రైతులు ఉపయోగించాలని రైతులకు అవగాహన కల్పించారు.నానో యూరియా డి ఏ పి పిచికారి పద్ధతిలో వృధా శాతం తగ్గుతుందని , పంట దిగుబడి పెరగడంతో తోపాటు నాణ్యత పెరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ . వ్యవసాయ విస్తరణ అధికారి ఏ సైదులు గ్రామ సర్పంచ్ పగిడి రాధా రామలింగం, రైతులు పుల్లారెడ్డి,ప్రభాకర్ రావు, చంద్రయ్య , పుల్లయ్య,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.