ప్రజలకు ఆహ్లాదం.. చిన్నారులకు ఆటస్థలం
విజయ గార్డెన్స్‌లో ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం
నాగోల్, ఆగస్టు 25 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలో విజయ గార్డెన్స్ కాలనీ ప్రజలకు కొత్తగా ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ అందుబాటులోకి వచ్చాయి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పిల్లలకు ఆటల కోసం, పెద్దలకు వ్యాయామం చేసుకునేందుకు ఈ సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. కాలనీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్ జిమ్, పార్క్ ఏర్పాటు చేసినందుకు కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్గౌడ్, సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తూర్పటి చిరంజీవి, శిల్పారెడ్డి, పోచంపల్లి రాజేందర్రెడ్డి, కాలనీ అధ్యక్షుడు రాంచంద్రరెడ్డి, మల్లారెడ్డి, సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






