2 April, 2026 | 1:33 PM

పాఠశాలలో ఓపెన్ హౌస్

07-12-2024 06:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోమవారపేట బాలికల ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా పోలీస్ శాఖ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న రక్షణ చర్యలు ఆయుధాల వినియోగం శాంతిభక్తుల పర్యవేక్షణ అంశాలపై డిఎస్పి ప్రభాకర్ పోలీస్ అధికారులు గంగారెడ్డి పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.