calender_icon.png 23 October, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో "ఓపెన్ హౌస్"

22-10-2025 06:37:26 PM

సిద్దిపేట క్రైమ్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి చట్టాల అమలు, కేసులు నమోదు, నేరస్తులను పట్టుకోవడం, ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, మహిళలు, పిల్లల రక్షణ చట్టాలు, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు, గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, పోలీస్ స్టేషన్లో వివిధ గదులు, సీసీ కెమెరాల పనితీరు, తదితర అంశాల గురించి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు వివరించారు.