22-10-2025 06:30:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నమూనాలో, అత్యంత నాణ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరగాలన్నారు. నిర్ణీత గడువులోగా విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సూర్యారావు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.