calender_icon.png 4 May, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్, సీఎం చిత్రపటాలకి పాలాభిషేకం

04-05-2025 04:13:31 PM

బెల్లంపల్లి అర్బన్: బీసీ కులగణను దేశవ్యాప్తంగా చేపట్టాలన్న రాహుల్ గాంధీ పిలుపును కేంద్ర ప్రభుత్వం సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్(Bellampalli MLA Camp Office)లో టీపీసీసీ పరిశీలకులు జిల్లా ఇన్చార్జి జంగా రాఘవరెడ్డి తో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress Party leader Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

నియోజవర్గ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నహక సమావేశాన్నీ పురస్కరించుకొని పాలాభిషేకం చేశారు. మండలాల వారిగా క్యాంప్ ఆఫీసులో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు రాంభూపాల్, సిహెచ్ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, పేరం శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కారుకూరి రామచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.