calender_icon.png 21 January, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ టెక్నాలజీతో ఒప్పో రెనో 15 సిరీస్

21-01-2026 01:49:16 AM

హైదరాబాద్, జనవరి 20: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మొబైల్ మార్కెట్ లోనూ సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఒప్పో ఇండియా ఏఐ టెక్నాలజీతో  తన ప్రీమియం రెనో15 సిరీస్‌ను తీసుకొచ్చింది. మూడు వేరియంట్‌లతో రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ మరియు రెనో15 ఆవిష్కరించింది. ట్రావెలర్స్, ఇన్ స్టా యూజర్లు, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్ లో ఆధునిక కెమెరా సిస్టమ్‌, ఇంటెలిజెంట్ ఏఐ,  ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. ప్రకృతి అంశాల స్ఫూర్తి తో కలర్ ఫినిష్‌లు , ప్రపంచంలో తొలి హోలో ఫ్యూజన్ ప్రో టెక్నాలజీ తో, రెనో 15   సిరీస్ కాంపాక్ట్, సౌకర్యవంతమైన ఆకృతిని బలమైన నిర్మాణ నాణ్యతతో కలిపి అందిస్తోంది.

ఈ సరికొత్త రెనో 15 సిరీస్ లో 200 ఎంపీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉందని ఒప్పో  ఇండియా కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ చెప్పారు. 120x డిజిటల్ జూమ్ ప్యూర్ టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ మరియు ఏఐ ఎడిటింగ్ టూల్స్ తో సరికొత్త అనుభూతిని ఇస్తాయని తెలిపారు.భారత దేశంలో తమకు ఉన్న 100 మిలియన్ల యూజర్ల కోసం సరికొత్త టెక్నాలజీతో ఈ సిరీస్ ను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. రెనో 15 ప్రో 12జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ రూ. 67,999కి, మరియు 12జీబీ + 512జీబీ వేరియంట్ రూ 72,999కి అందుబాటులో ఉంది. రెనో15 ప్రో  మినీ 12జీబీ + 256జీబీ వేరియంట్ రూ. 59,999కి,12జీబీ + 512జీబీ వేరియంట్ రూ.64,999కి అందుబాటులో ఉంది.