calender_icon.png 21 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ మార్కెట్ ఢమాల్.. ౧౦ లక్షల కోట్లు హుష్

21-01-2026 12:24:18 AM

  1. 1,0౬౫ పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
  2. 29,000 కోట్ల విలువైన షేర్ల విక్రయం

ముంబై, జవనరి ౨౦: భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ గడిచిన రెండు రోజుల్లో 1,0౬౫ పాయింట్ల నష్టంతో 82,180 వద్ద, నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 25,2౩౨ సూచిక వద్ద స్థిరపడ్డాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే రూ.10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్‌ఈ)లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక్క జనవరి నెలలోనే సుమారు 29,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం స్టాక్ మార్కెట్ పతనానికి ఆజ్యం పోసింది.

నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 25,232 వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2.5 శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.468 లక్షల కోట్ల నుంచి రూ.456 లక్షల కోట్లకు పడిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగానే స్టాక్ మార్కెట్ పతనమైందని విశ్లేషకులు చెప్తున్నారు.