24 July, 2026 | 3:26 AM

చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్‌లో అవకాశం

24-07-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, జూలై 23(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ లో 10 వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం ఉందని గడప నవీన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ మండలంలోనే ఉంటూ మధ్యలో చదువు మానేసిన వారు అత్వెల్లి ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఇంటర్ తో పాటు 10 వ తరగతి లో ప్రవేశానికి14 సంవత్సరాలు దాటిన వారంతా కూడా ఓపెన్ స్కూల్ కు దరఖాస్తు చేసుకోగలరని వివరాలకు గడప నవీన్ తెలిపారు. పూర్తి వివరాలకై 9392585359 నంబర్ ను సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు...