డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి
డీఐ రవికుమార్
ఉప్పల్, జూలై 23 (విజయక్రాంతి): రామంతాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరి ణామాలపై అవగాహన కార్యక్రమాన్ని ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉప్పల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






