calender_icon.png 3 February, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరోక్ష విధానంలో నిర్వహించే వాటికీ ఆప్షన్ తీసుకోవాలి

03-02-2026 02:12:17 AM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

వనపర్తి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానములో నిర్వహించే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫిషియో ల మున్సిపాలిటీ ఎంపిక కొరకు నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుండి 14వ తేదీ లోపు నోటీస్ లు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డిఆర్డీఒ పి.డి. ఉమాదేవి, సి.పి. ఒ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.