12 May, 2026 | 9:46 AM

జహీరాబాద్‌లో స్మార్ట్ సిటీ

29-08-2024 07:12 AM
  1. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల లిస్టులో స్థానం
  2. ఆమోదించిన కేంద్ర క్యాబినెట్ 
  3. దేశవ్యాప్తంగా మొత్తం 12 పట్టణాల ఎంపిక
  4. ఏపీ నుంచి ఓర్వకల్లు, కొప్పర్తి పట్టణాలు 
  5. ఉత్పత్తి రంగ సామర్థ్యం పెంపు లక్ష్యంగా కేంద్రం నిర్ణయం

సంగారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి)/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్పత్తి రంగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు 6 ప్రధాన పారిశ్రామిక కారిడార్లలో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందులో తెలంగాణకు చెందిన జహీరాబాద్ పట్టణానికి స్థానం లభించింది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం భేటీలో  చర్చించిన అంశాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారత్‌లో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆయన స్పష్టం చేశారు. 10 రాష్ట్రాల్లోని 12 పట్టణాల అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌ఐసీడీపీ) కింద రూ.28,602 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 12 లక్షల మంది, పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 

3 వేల ఎకరాల్లో కారిడార్

తెలంగాణలోని జహీరాబాద్‌లోని 3,245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు భేటీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.2,361 కోట్లను వెచ్చించనున్నారు. జహీరాబాద్ పారిశ్రామిక హబ్ ద్వారా 1.74 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. తెలంగాణేొకర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జహీరాబాద్‌లో 

 రాష్ట్రానికి 30 ఎఫ్‌ఎం స్టేషన్లు 

దేశవ్యాప్తంగా మొత్తం 730 ప్రైవేట్ ఎఫ్‌ఎం స్టేషన్లకు అనుమతిచ్చిన కేంద్ర క్యాబినెట్.. తెలంగాణలోని 10 నగరాల్లో 30 రేడియా కేంద్రాలను నెలకొల్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ఏర్పాటు కోసం త్వరలోనే ఈ నిర్వహిస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మాతృభాషలో కంటెంట్‌ను పెంచడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు టైర్ టైర్ నగరాలకు ఎఫ్‌ఎం రేడియోను తీసుకెళతామని వెల్లడించారు. స్థానిక ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు వివరించారు. తెలంగాణ జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబాబాద్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (3), రామగుండం (3), సూర్యాపేట (3) స్టేషన్లను నెలకొల్పనున్నారు.  

పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం కేవలం 125 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కీలకమైన గ్యాస్ టాప్ ఆఫ్ పాయింట్ జహీరాబాద్, బీదర్ మధ్యనే ఉండటం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రెండు పట్టణాలకు అవకాశం కల్పించారు.

ఏపీకి చెందిన ఓర్వకల్లు, కొప్పర్తి పట్టణాలను పారిశ్రామిక కారిడార్లుగా అభివృద్ధి చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,956 ఎకరాలు కేటాయించగా ఇందుకోసం రూ.2,137 కోట్లను ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిద్వారా 54 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో రూ.2,786 కోట్లు వెచ్చించనున్నారు. ఈ హబ్ ద్వారా 45 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రాయలసీయకు లబ్ధి చేకూరనుంది.   

ఉత్పత్తి రంగానికి ఊతం

కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు సైతం గణనీయంగా పెరుగుతున్నా యని పేర్కొన్నారు. ఈ 12 నగరాలు రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆయన వివరించారు. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో బలమైన, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రాంతీయ సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) తెలిపింది. తద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని వివరించింది. 

5 కీలక నిర్ణయాలు

ఈ భేటీలో మరో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించే లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పారిశ్రామిక స్మార్ట్ సిటీలను సృష్టించి ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పీఎం గతిశక్తి ప్రణాళికకు అనుసంధానం చేసి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీలను సృష్టిస్తామని స్పష్టం చేశారు. వీటితో పాటు మూడు మెగా రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.6,456 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఈ రాష్ట్రాల్లో కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు సుమారు 300 కిలోమీటర్ల కొత్త లైన్లను నిర్మించనున్నారు. 234 నగరాలకు ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియా సేవలను విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా కొత్తగా 730 చానెళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ చానెళ్ల నిర్వహణ అంచనా రిజర్వ్ ధర రూ.784.87 కోట్లుగా నిర్ణయించగా వీటికి సంబంధించి త్వరలోనే ఈహునవేలం నిర్వహించనున్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల కోసం రూ.4,136 కోట్ల సాయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

మోదీకి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు

జహీరాబాద్‌ను ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఎంపిక చేసిన పట్టణాల జాబితా

  1. జహీరాబాద్ (తెలంగాణ) 
  2. కొప్పర్తి, ఓర్వకల్లు (ఆంధ్రప్రదేశ్)
  3. ఖుర్పియా (ఉత్తరాఖండ్)
  4. రాజ్‌పురా (పంజాబ్) 
  5. ఆగ్రా (యూపీ)  పర్యావరణ హిత పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం
  6. ప్రయాగ్‌రాజ్ (యూపీ)
  7. గయ (బీహార్)  వ్యవసాయం, వస్త్ర పరిశ్రమ, ఇంజినీరింగ్ రంగాలపై దృష్టి
  8. ఈఘీ (మహారాష్ట్ర) ఆధారిత పారిశ్రామిక కేంద్రం
  9. జోధ్‌పూర్‌వూళీ (రాజస్థాన్)
  10. పాలక్కడ్ (కేరళ)
  11. జంషెడ్‌పూర్ అసన్‌సోల్