10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

వినియోగదారుల కోర్టులో విజయం సాధించిన సాధారణ గృహిణి

08-12-2025 12:00 AM
  1. హిందూజా ఫైనాన్స్ పై కేసు గెలిచిన బి.శ్రీదేవి

మధ్యతరగతి మహిళా సాధించిన అరుదైన విజయం..

కొత్తగూడెం, డిసెంబర్ 7, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీ నివాసి అయిన బాదావత్ శ్రీదేవి 2019 వ సంవత్సరంలో కుటుంబ అవసరాల నిమిత్తం హిందూజా ఫైనాన్స్ ఆధ్వర్యంలో అశోక్ లేలాండ్ దోస్త్ బండి కొనుగోలు చేశారు. రూ.6.30లక్షలు ఫైనాన్స్ రూపంలో చెల్లించాలని కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

36 నెలలకు గాను 21 నెలలు కంపెనీ వారి ఖాతాలో జమ చేసినా , రెండు నెలల ఆలస్యానికి వ్యవధి ఉన్నా కూడా పూర్తి నెలల సంబంధించిన డబ్బును చెల్లించాలని హిందూజా ఫైనాన్స్ అధికారులు శ్రీదే వి పై ఒత్తిడి చేసి, నోటు రాయించుకోవటానికి ప్రయత్నించగా, అందుకు ఆమె తిరస్కరించి ,నాకు సమయం ఉన్నా కూడా మీరు సమయం ఇవ్వకుండా నాపై ఒత్తిడి తెస్తూ మానసికంగా వేధించటం సరికాదంటూ ఫైనాన్సు ఉద్యోగులను కోరింది.

మహిళా అని చూడకుండా భయభ్రాంతులకు గురి చేసే ప్ర యత్నం చేసినందున ఆమె కన్జ్యూమర్ కోర్టులో ఫైనాన్స్ అధికారులపై 2023లో కన్జ్యూమర్ కోర్టు ఖమ్మంలో కేసు నమో దు చేయించారు.కేసు వేసినంత మాత్రాన నీకు ఒరిగేదేమీ లేదని కేసు విత్ డ్రా చేసుకోవాలని సంబంధిత కంపెనీ అధికారులు మహిళని చులకనగా చూసి ,హేళన చేసి నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు.

దీంతో అన్యాయం జరిగిందని నిర్ధారించుకొని ,ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టులో వేసిన కేసును కొన సాగించారు. రెండు సంవత్సరాల పాటు కేసు కొనసాగింది. పూర్తిగా డబ్బును జమ చేసి తనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే మీ బండి తీసుకోవాలని హుకుం జారీ చేశా రు. ఫైనాన్స్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు. తను కట్టాల్సిన డబ్బు కేవలం రూ2.40లక్షల  మాత్రమే చెల్లించాల్సి ఉండగా ,అదనంగా మరోరూ 1. 40 లక్షలు కలిపి మొత్తం రూ 3.80 లక్షలు కట్టాలని నోటీస్ జారీ చేసి ,భయపెట్టే ప్ర యత్నం చేశారు.

కోర్టులో కేసును నమోదు చేసి ఫైనాన్స్ కంపెనీ పై విజయం సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచిం ది. నారీలోకం గర్వించే విధంగా మహిళ అనే చులకన భావం చూసేటువంటి ఫైనాన్స్ ఉద్యోగులకు చంపపెట్టిన సమాధానం ఇచ్చారు. గత నెల హిందుజ ఫైనాన్స్ బండితోపాటు, నగదును కూడా శ్రీదేవికి అందించారు.