గ్రామీణ ఆరోగ్య పోషణ దినోత్సవం నిర్వహణ
02-04-2026 12:54 AM
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 1: శ్రీరంగాపూర్ అంగన్వాడి-3 కేంద్రంలో గ్రామీణ ఆరోగ్య పోషణ దినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తల్లులు పిల్లల ఆరోగ్య సంరక్షణలో పాటించాల్సిన జాగ్రత్తలపై కూడా సూచనలు ఇచ్చారు.కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ మంజులరాణి సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మద్దిలేటి, ఉపసర్పంచ్ ఖాజా, గ్రామ నాయకులు డి. శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి ఎల్లస్వామి, బీచుపల్లి, రాములు, ఆశా వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు




