22 July, 2026 | 2:01 AM

తెలంగాణలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ

22-07-2026 12:00 AM

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 

ముషీరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథ్వాలే ఆర్పీఐ-ఏ) తెలంగాణ సంస్థాగత బలోపేతం, విస్తరణపై హైదరాబాద్ టూరిజం ప్లాజాలో కీలక సమావేశం నిర్వహించింది. జాతీయ ఉపాధ్యక్షుడు భైగల్ల నాగేశ్వరావు, జాతీయ కార్యదర్శులు కొంపల్లి ప్రభుదాస్, పేరం శివ నాగేశ్వరరావు(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న ప్రసాద్ లు మాట్లాడారు. అన్ని జిల్లాలకు ఇన్చార్జులు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులను నియమిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నిధులను సమర్థంగా తీసుకురావడంతో పాటు పార్టీ విస్తరణకు కార్యాచరణ రూపొందించారు. కేంద్ర మంత్రి, ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథ్వాలే మార్గదర్శకత్వంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు నేతలు తెలిపారు.

అలాగే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఇకపై ఎలాంటి బాధ్యతలు లేవని, ఆయన నిర్వహించే సమావేశాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావద్దని జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. అన్ని కీలక నిర్ణయాలు జాతీయ నాయకత్వం, రాష్ట్ర ముఖ్య నాయకుల సలహాలతోనే తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా ఇన్చార్జ్ రోజా రాణి, సౌత్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివరాజ్, బీసీ సెల్ నాయకుడు సచిన్ గౌడ్, సంజీవరావు, జాడి చొక్కారావు పాల్గొన్నారు.