అనురాగ్‌లో బీటెక్ విద్యార్థుల ఓరియంటేషన్ డే ప్రోగ్రాం
ఘట్ కేసర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహించిన బీటెక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్2026 ను ఘనంగా జరిగింది. నూతన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఘనంగా స్వాగతించింది. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ చరిత్ర, అభివృద్ధి, పరిణామ క్రమాన్ని వివరించారు.
సంస్థ ప్రయాణం గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. యూనివర్సిటీ సీఈవో ఎస్. నీలిమ మాట్లాడుతూ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయ చరిత్ర, అభివృద్ధి, నిరంతరం విస్తరిస్తున్న విద్యా, కెరీర్ అవకాశాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. విజయ కుమార్, డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, ప్రొఫెసర్ ఎం. ముత్తారెడ్డి, డీన్, ఎగ్జామినేషన్స్, ప్రొఫెసర్ కె. సుధీర్ రెడ్డి, డీన్, అకడమిక్స్, డాక్టర్ సిద్ధార్థ ఘోష్, డైరెక్టర్, అనురాగ్ పల్లా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్ట్రాటజీ, ప్రొఫెసర్ చ. గోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ అర్చనా మంత్రీ, వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ యు. బి. దేశాయ్, ఛాన్సలర్, అనురాగ్ యూనివర్సిటీ ప్రసంగించారు. కార్యక్రమం ముగింపులో డాక్టర్ మహీపతి శ్రీనివాస రావు, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతం ఆలపించడంతో కార్యక్రమం ముగిసింది.






