19 August, 2026 | 2:46 AM

కుమ్మరికుంట కట్ట రోడ్డుకు మోక్షం

19-08-2026 01:38 AM

కుంటను పరిశీలించిన జోనల్ కమిషనర్ వికాస్ మహాతో 

ఎల్బీనగర్, ఆగస్టు 18 : హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ల ప్రజల ఎదురుచూపులు త్వరలో తీరనున్నది. ఎట్టకేలకు హయత్ నగర్ డివిజన్ లోని కుమ్మరికుంట కట్టపై  బీటీ రోడ్డు నిర్మాణానికి మోక్షం కలిగింది. ఏడాది కాలంగా కాగితాలకే పరిమితమైన రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు కార్యరూపం కానున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మల్కాజిగిరి మున్సి పల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో అధికారులతో కలిసి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, చేపట్టనున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా హయత్ నగర్ డివిజన్ లోని కుమ్మరికుంటను పరిశీలించారు.

కట్టపై నిర్మించనున్న బీటీ రోడ్డు ప్రతిపాదనలను స్థానికుల సమక్షంలో పరిశీలించారు. త్వరలో బీటీ రోడ్డు పనులను ప్రారంభిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం బాగ్ హయత్ నగర్ లోని మాదిగ స్మశాన వాటికను పరిశీలించారు. స్మశాన వాటిక శిథిలావస్థకు చేరిందని, త్వరలో స్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. పర్యటనలో భాగంగా కమిషనర్ వికాస్ మహాతో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు.

పెద్దఅంబర్పేట్, పసు మాముల,  తారామతిపేట్, బచారంలోని ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు మెరుగైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడానికి అవ సరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. ఆయన వెంట వివిధ శాఖల అధి కారులు, తెలంగాణ రాష్ట్ర యాదవ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. 

కుమ్మరికుంట కట్టపై బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి తెలంగాణ రాష్ట్ర యాదవ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ 

ఉమ్మడి హయత్ నగర్ డివిజన్ అభి వృద్ధికి టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర యాదవ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ అన్నారు. బాగ్ హయత్ నగర్ లో ఉన్న మాదిగ సంక్షేమ సంఘం స్మశాన వాటిక అభివృద్ధికి, కుమ్మరికుంట కట్టపై బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు సాధించారని తెలిపారు. ఇందులో భాగంగా కుమ్మరికుంట కట్టపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ ఎన్వోసీ జారీ చేసిందని గజ్జి భాస్కర్ యాదవ్ చెప్పారు. 

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ సీఈవో ఏఎస్‌ఎన్ రెడ్డి జారీ చేసిన నో అబ్జె క్షన్ లెటర్ ను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతోకు అందజేశానని చెప్పారు. కుమ్మరి కుంట కట్టపై రోడ్డు, బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పడు తుంది, పనులకు అవసరమైన పర్మిషన్లు రావడంతో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాని పేర్కొన్నారు.