శాంతిభద్రతల తెలంగాణే మా లక్ష్యం
బండి సంజయ్ వ్యాఖ్యలు బాధించాయి
మంత్రి సీతక్క
ములుగు(జనగామ), డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఎన్‌కౌంటర్లు లేని శాంతిభద్ర తల తెలంగాణే తమ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మా ట్లాడారు. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్, పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులు హతమైన సంఘటనపై ఆమె స్పందించారు. ఇలాంటి సంఘటనలు లేకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డా రు.
శాంతిభద్రతలను పరిరక్షించడమే ప్రభు త్వ ధ్యేయమన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం సరికాదన్నారు. తాను నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నానని, ఆ ఉద్యమాన్ని విడిచి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తనను మొదటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు.
తనను అనే ముందు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్‌ది ఏ భావజాలమో తెలుసుకోవాల న్నా రు. తాను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీ మద్దతుతోనే గెలిచానని గుర్తు చేశా రు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






