ప్రభుత్వ శాఖలన్నింట్లో టీ సేవలు
09-12-2024 02:03 AM
* ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖన్నింట్లోనూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందిస్తున్న ఫైబర్ నెటవర్క్ సేవలు వినియోగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్రఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సేవలను బట్టి టారిఫ్‌లు మారుతూ ఉంటాయని, సేవలకు సంబంధించిన చెల్లింపులను నేరుగా గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చేయాలని స్పష్టం చేశారు. సేవలను ప్రతిశాఖ పరిధిలో ఓనోడల్ అధికారి నిర్వహిస్తారన్నారు.






