calender_icon.png 22 January, 2026 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బడికి సార్లు కావాలి

20-09-2024 12:36:52 AM

ఉపాధ్యాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

కుమ్రంభీం ఆసిఫాబాద్,సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 17 మంది ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వారి స్థానంలో రావాల్సిన ఉపాధ్యాయుల్లో ఇద్దరు మాత్రమే రావడంతో చదువుకునేందుకు ఇబ్బందిగా మారిందని గురువారం విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పాఠశాల నుంచి ర్యాలీగా వెళ్లి రహదారిపై ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. తమ పాఠశాల ఉపాధ్యాయుల స్థానంలో నూతన ఉపాధ్యాయులను కేటాయించి తమ ఇబ్బందులు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.