పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత..
కామారెడ్డి, ఆగస్టు 25 (విజయక్రాంతి): పచ్చదనం కోసం మన అడుగు భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వన మహోత్సవం లో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కే. నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఉదయభాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ, ఆర్‌ఎస్‌ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






