26 August, 2026 | 1:49 AM

ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం

26-08-2026 12:00 AM

చౌటుప్పల్, ఆగస్టు 25: చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

విపరీతమైన వాతావరణ మార్పులు, ఎల్నినో వంటి ప్రభావాలకు అడవుల నరికివేత, పచ్చదనం తగ్గిపోవడం కూడా కారణమవుతున్నాయని తెలిపారు. చెట్లను నరికిన చోట వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో గ్రామస్థులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని లింగస్వామి, వార్డు సభ్యులు భూతం లింగస్వామి, ఎంజాల శ్రీకాంత్, సామ సుమిత్ర, పెద్దిరెడ్డి, ఫీల్ అసిస్టెంట్ స్వర్ణ, విలేజ్ సెక్రటరీ సురేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.