6 August, 2026 | 2:32 AM

అభిమానులు గర్వపడే సినిమా మాది

06-08-2026 12:00 AM

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7న థియే టర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ భీమవరంలో జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’తో ఆగస్టు 7న థియేటర్లలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోంది.

ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు ధైర్యం ఇస్తున్న అభిమానులందరూ గర్వపడే సినిమా ఇది. మా సినిమాపై ఉన్న నమ్మకంతో ఆగస్టు 6 రాత్రి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రీమియర్స్ వేస్తున్నాం” అన్నారు. హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను చేసిన ‘చైత్ర’ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గాంధీ చాలా హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా. వరుణ్‌తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా అందరినీ తప్పకుండా అలరిస్తారు. ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా” అని చెప్పింది. ఈ వేడుకలో సంగీత దర్శకుడు తమన్, సింగర్ నల్గొండ గద్దర్, మంతెన రామరాజు, నిశాంత్, మూవీ టీం అందరూ పాల్గొన్నారు.