calender_icon.png 16 September, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచారం లేకుండానే సోషల్ ఆడిట్ అధికారుల తీరుపై మండిపాటు

16-09-2025 12:00:00 AM

నాగల్ గిద్ద, సెప్టెంబర్ 15: నాగల్గిద్ద మం డలంలో ఉపాది హమీ పథకం కింద చేపట్టిన పనులపై సోమవారం మండల కేంద్రం లోని రైతు వేదిక కార్యలయం వద్ద సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఉపాది హమీ పను ల్లో కూలీల హాజరు లేకుండా డబ్బులు చె ల్లించినట్లు ఆరోపించినట్లు తెలిసింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు 5 కోట్ల 50 లక్షల నిధులతో 31 గ్రామ పంచాయితీలో చేపట్టిన వివిధ పనులపై నివేదిక చదివి వినిపించారు.

పనులు సక్రమంగా చే పట్టక పోవడంతో మండల సోషల్ ఆడిట్ స మాచారం ప్రజలకు అందించకుండా ఏపివోతో సహ టేక్నికల్ అసిస్టెంట్, పిల్ అసి స్టెంట్, పంచాయితీ కార్యదర్శి ఇష్టారాజ్యం గా వ్యవహరించారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి తూతూ మంత్రంగా నిర్వహించిన సోషల్‌ఆ డిల్ అధికారులపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో ఏపిడి బాలరాజు, సోషల్ ఆడిట్ ఎస్టిఎం దత్తు, రాజు, ఎంపీడీవో మహమ్మద్ హుస్సేన్, మురళి, టిఏలు, పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు.