16-09-2025 12:00:00 AM
అర్మూర్, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి) : అర్మూర్ మున్సిపల్ పరిధిలోని బేకరీలు, స్వీట్ దుకాణాల్లో సోమవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రతను పాటించకుండా ఫ్రీజ్ లలో కొంత కాలంగా నిలువ ఉంచుకున్నటువంటి తిను బండారాలు, మాంసం నిల్వలను పరిశీలించారు. ఢిల్లీ స్వీట్ హోమ్, అనూ బేకరీ, డాల్ఫిన్ బేకరీ, వినాయక బెస్ట్ బేకరీ తదితర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఫంగస్ వచ్చినటువంటి బెడ్స్ డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాలను గుర్తించారు. అధికారులు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు దుకాణ యజమానులకు జరిమానాలు విధించారు. పరిశుభ్రంగా ఉంచాలని, పాడైపోయిన వాటిని పడేయాలని సూచించారు.
కాలం చెల్లిన తినుబండారాలను అమ్మ వద్దని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయాలని కోరారు. ఈ తనిఖీలలో శానిటరీ సూపర్వైజర్ మల్లెపూల నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, హెల్త్ అసిస్టెంట్ సురేష్ మున్సిపల్ సిబ్బంది రవి, ప్రశాంత్ మరియు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.