calender_icon.png 16 September, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాలో కరీంనగర్ విద్యార్థికి ద్వితీయ బహుమతి

16-09-2025 12:25:47 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): స్థానిక కరీంనగర్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ హైస్కూల్ విద్యార్థి రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాలో ద్వితీయ బహుమతి పొందడం జరిగింది. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో, కామారెడ్డిలో సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి విజ్ఞానమేళాలో విద్యార్థి చిరంజీవి తుమ్మ అక్షిత్ సుందర్ అద్భుత ప్రతిభ కనబరిచారు. పదవ తరగతి కిషోర వర్గ విభాగంలో క్షేత్ర గణిత ప్రయోగం ప్రదర్శించి ద్వితీయ బహుమతి ఈ సందర్బంగా ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల రవాణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, డాక్టర్ నాళ్ల సత్య విద్య సాగర్, రాపర్తి శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్, కొత్తూరి ముకుందం, గోలి పూర్ణచందర్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులదేవి, అక్షిత్ సుందర్ ను అభినందించారని పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.