02-08-2025 01:49:49 AM
డివిజన్ కు ఇద్దరు, ముగ్గురు బరిలో నిలిచేందుకు ఆసక్తి
ఎలాగైనా ఎమ్మెల్యే మదిలో ఉండాలన్నదే నేతల ఉత్సాహం
పాలమూరు డివిజన్ కార్పొరేట్ సీట్లకు భలే డిమాండ్
మహబూబ్ నగర్ ఆగస్టు 1 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ కాంగ్రెస్ పా ర్టీలో ఓవర్ లోడ్ కనిపిస్తుంది. మున్సిపాలి టీ నుంచి కార్పొరేషన్ కు చేరుకున్న మహబూబ్ నగర్ లోని డివిజన్ లలో కార్పొరే ట్లుగా నిలబడినందుకు అధికార పార్టీలోని పలువురు నేతలు అత్యంత ఆసక్తి కనబరుచుతున్నారు. ఇప్పటినుంచి ఎమ్మెల్యే దృష్టిలో ఉండి ఎలాగైనా తమ డివిజన్ నుంచి సీటు దక్కించుకోవాలని అత్యుత్తహం చూపుతున్నారు.
మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదాకు చేరుకోవడంతో డివిజన్ సంఖ్య త గ్గుతుందని అనుకుంటారు. కాగా 60 డివిజ న్ లుగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ చేరుకోవడంతో ఉత్సాహవంతుల్లో మరింత ఆశ రెట్టింపు అయింది.
ఇప్పటికే ఖరారు అంటూ ప్రచారం
జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డివిజన్ స్థా యి నేతలకు మీరే అభ్యర్థులు అని చెప్పకపోయినప్పటికీ మా డివిజన్ నుంచి మాకే పక్క అంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రతి డివిజన్ నుంచి ముగ్గురు నుంచి నలుగురు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపడంతో కాంగ్రెస్ పార్టీలో ఓవర్ లోడ్ దిశగా అభ్యర్థులను ఎంపిక చే యవలసి ఉంది.
గెలిచే అభ్యర్థులకే సీట్లు ఖరారు చేయాలని యోజనలో కాంగ్రెస్ పా ర్టీ ఉందని తెలుస్తుంది. మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసిన అధికార పార్టీ మొదటి కా ర్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలనే యోచనలో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఉత్సాహవంతు లు నేను బరిలో ఉంటాను మీరు మద్దతుగా ఉండండి మీకు ఏమి కావాలో మేము చూ సుకుంటాం అంటూ ఇప్పటికే చర్చలు ఊపందుకు ఉన్నాయి.
-కాంగ్రెస్ వైపు చూస్తున్న ప్రతిపక్ష నేతలు
కొందరు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ లభిస్తే తాము పార్టీలోకి వ చ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంప్రదింపులు జరుపుతున్నారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని భావనతో ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నా రు. మేయర్ హోదా ఆశిస్తున్న నేతలు ఎ లాగైనా వివిధ డివిజన్లో నుంచి మద్దతుదారులను గెలిపించుకొని మేయర్ దక్కించు కోవాలనే ఆశతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
ఇలాంటి పనులతో ముందుకు సా గితే మేలు జరుగుతుందని ఆశాభావంతో ప్రత్యేక ప్రణాళికలు వేసుకొని అంతర్లీనంగా నే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటినుంచే కార్యచరణ షురూ చేసిండ్రు. అధి కార పార్టీలో ఓవర్ లోడ్ కాంగ్రెస్ పార్టీకి మే లు చేస్తుందా ? బరిలో తామంటే తాము ఉంటామంటూ రెబల్ అభ్యర్థులు ఎక్కువగా అయి కీడు చేస్తుందా ?అంచనాలును పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీ ట్లు దక్కని వారికి బుజ్జగించుకుంటూ అడుగులు వేస్తేనే అధికార పార్టీకి మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.