calender_icon.png 2 August, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ గురుకులంలో వసూళ్ల దందా!

02-08-2025 01:51:50 AM

  1. అడ్మిషన్ పేరుతో పేరెంట్ వద్ద పదివేల లంచం డిమాండ్ చేసిన వార్డెన్, కంప్యూటర్ ఆపరేటర్

ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్.

నిబంధనలకు విరుద్ధంగా పాత సామాగ్రి అమ్మకాలు

విద్యార్థులతోనే ఆ సామాగ్రి తరలిస్తూ వెట్టి చాకిరి

నాగర్ కర్నూల్ ఆగస్టు 1 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్జిల్లా కేంద్రంలోని మైనార్టీ బా లుర గురుకుల పాఠశాలలో వసూళ్ల దందా బయటపడింది. ఆఫ్ లైన్ అడ్మిషన్లు కావడం తో ఒక్కో అడ్మిషన్ పేరుతో పదివేల నుండి 50 వేల వరకు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి వార్డెన్ ధర్వేష్, కంప్యూటర్ ఆపరేటర్ ము స్తాక్ ఇరువురూ భారీగా వసూళ్లకు పాల్పడినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు.

గత కొద్దిరోజుల క్రితం అదే పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది తన ఇద్దరు పిల్లలను అదే పాఠశాలలో చేర్చారు. అందుకు సహకరించిన వార్డెన్ ధర్వేష్, కంప్యూటర్ ఆపరేట ర్ ముస్తాక్ తమకు కానుకగా పది వేలు లంచం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అది ఇ చ్చుకోలేక తన బాధను తోటి సిబ్బందితో చె ప్పుకుంది. దీంతో డిమాండ్ చేసిన రికార్డ్ ఆ డియో లీక్ కావడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ ప్రారంభించారు. దాంతోపాటు హాస్టల్ వా ర్డెన్ గా పనిచేస్తున్న ధర్వేష్ కూరగాయలు, పాలు, గుడ్లు , ఇతర సామాగ్రి టెండర్ దా రుల నుంచి భారీగా ముడుపులు అందుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. గతంలో ము రిగిన కూరగాయలతోనే వంటలు వండడం తో విజయక్రాంతి అప్పట్లో కథనాన్ని ప్రచురించి మైనార్టీ గురుకులంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులను తట్టి లేపింది.

దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో తనకు అనుకూలంగా ఉండే కొందరు వ్యక్తుల సహాయంతో తనపై వేటుపడకుండా జాగ్రత్త పడి నట్టు కూడా అప్పట్లో చర్చ జరిగింది. గురువారం నిబంధనలకు విరుద్ధంగా గురుకుల పాఠశాలలోని పాత సామాగ్రిని విద్యార్థులతోనే తరలించి అట్టి సామాగ్రిని నిబంధ నల కు విరుద్ధంగా స్క్రాప్ కింద అమ్మేశారు. గ తంలోనూ పాత వంట సామాగ్రి ఇతర వస్తువులను అమ్ముకొని అందరూ పంచుకున్న ట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

సదరు ప్రిన్సిపల్ సుంకన్న ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అందుకే తనకు ఐదు వేలు ఇవ్వాలని సదరు పేరెంటుతో డిమాండ్ చేసిన ఆడియో వల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల్లో జీతాలు పొందే ప్రిన్సిపల్ అప్పుల్లో కోరుకుపోవడం వెనుక బెట్టింగ్ గేమ్స్ కారణమని విశ్వసనీయంగా తెలిసింది. దాని అలుసుగా తీసుకొని ప్రస్తు తం పాఠశాల ప్రారంభం నుంచి పాతుకుపోయిన వార్డెన్, కంప్యూటర్ ఆపరేటర్ మరి కొందరు ఈ దందాకు తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే విష యాలపై పలుమార్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి నా కొంతమంది పెద్దల సహకారంతో తనని ఏమి చేయలేరంటూ తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులని బెదిరింపులకు దిగుతున్నట్లు వా పోతున్నారు. ఫలితంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. 

దీనిపై ప్రిన్సిపల్ సుంకన్న స్పందిస్తూ ఇప్పటికే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారని తప్పులు చేసి నట్టు తెలిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదంటూ పేర్కొన్నారు. వార్డెన్ ధర్వేశ్ స్పం దిస్తూ తనపై కావాలని కక్షపూరితంగా కుట్ర చేస్తున్నారంటూ పేర్కొన్నాడు. అడ్మిషన్ పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు వస్తు న్న ఆడియోలో తన వాయిస్ కాదంటూ కొ ట్టి పారేసారు. ఇదే ఘటనపై మైనార్టీ రెసిడెన్షియల్ రీజినల్ కోఆర్డినేటర్ జామీర్ ఖాన్, అకాడమీక్ కో ఆర్డినేటర్ సలీం వారి సభ్యు లు పాఠశాలతనిఖీచేశారు.