calender_icon.png 2 August, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డు మంజూరు

02-08-2025 01:47:53 AM

  1. లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణి 

వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి

శ్రీరంగాపురం, ఆగస్టు 1 : ప్రభుత్వం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు మం జూరు చేయడం జరుగుతుందని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. శుక్రవా రం వనపర్తి నియోజకవర్గంలోని శ్రీరంగాపూర్ మండలానికి సంబంధించి సర్వ వర్గ సామూహిక భవనంలో  నిర్వహించిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి శాసన సభ్యు లు తూడి మెఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుల గురించి ప్రజలు 10 సంవత్సరాలు ఎదురు చూసారని కానీ గత పాలకులు ఇవ్వలేకపోయారని విమర్శించారు.  పది సంవత్సరాల్లో గత పా లకులే లబ్ధి పొందారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు లేక పెళ్లి అయిన వారి పేర్లు, పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్పించకపోవడంతో  లబ్ధిదారులు చాలా నష్టపోవడం జరిగిందని అన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలను నెర వేర్చడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. శ్రీరంగాపూర్ మండలంలో 345 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా పేర్లు చేర్చిన రేషన్ కార్డుదారులతో కలిపి 2152 మందికి లబ్ధిచేకురనున్నట్లు తెలిపారు. రంగ సముద్రం దగ్గర టూరిజం శాఖ ద్వారా పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

దేవాలయం వద్ద తేరు గుంజెటపుడు ఇబ్బందుల లేకుండా రోడ్డు పనులు చేయించేందుకు నిధు లు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. రూ 21 కోట్ల నిధులతో శ్రీరంగాపూర్ లో ఇరిగేష న్ పనులు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం , జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్, తహసిల్దారు రాజు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ మండల  ముఖ్య నాయకులు, రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.