నగరంలో పండుగలా హ్యాపీ సండే
ఎల్లప్పుడూ నిర్వహించాలని ప్రజల ఆసక్తి
ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు,తల్లిదండ్రులు
అందరిని ఆకర్షిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం
నగరంలో హ్యాపీ సండే వేడుకకు విశేష స్పందన
మహబూబ్ నగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహానగరంగా అడుగులు వేస్తున్న మహబూబ్ నగరం లో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శ్రీకారం చుట్టిన హ్యాపీ సండే కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి ఆదివారం బస్టాండ్ సమీపంలో స్టేడియం మైదానం రోడ్డు దగ్గర నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత నృత్యాలు, ప్రత్యేక వ్యాయామాలతో తదితర కార్యక్రమాలు నిర్వహించడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం ఎంతో ఆసక్తిగా ఉదయం 6 గంటలకు చేరుకోవడం విశేషం.
ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించే హ్యాపీ సండే కార్యక్రమానికి పుర ప్రముఖులతోపాటు వ్యాపారస్తులు, నగరవాసులు చిన్న పెద్ద లేకుండా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వారి పిల్లలను తీసుకువచ్చి అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేలా చేసేందుకు ఆసక్తి కనబరుచుతుండ్రు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 99 రోజులు కాదు నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.
హ్యాపీ సండే అద్భుతం. ప్రతి ఆదివారం ఉండాలి
నగర వాసులందరినీ ఒకే చోట చేర్చి, ఉత్సాహాన్ని నింపడంలో ఈ వేడుక అద్భుతంగా విజయ తీరాలకు చేరుతుంది. ఒత్తిడి లేని జీవనం, స్నేహపూర్వక వాతావరణమే లక్ష్యంగాసాగుతున్న హ్యాపీ సండే కార్యక్రమం అందరికీ ఒక తీపి జ్ఞాపకం గా మిగులుతుంది. ఆదివారం ఒక్కరోజు నిర్వహించే ఈ కార్యక్రమం ఆ వారమంతా నగరంలో చర్చ జరుగుతుందంటే ఈ కార్యక్రమానికి ఎంత స్పందన ఉందో తెలుస్తుంది.
నగరవాసులంతా ముక్తకంఠంతో ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహించి అందర్నీ ఒకచోట నిర్వహించే అతిపెద్ద కార్యక్రమంగా మిగులుతుందని నగరవాసులు చెబుతున్న మాట. నూతన మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక అడుగు వేసి నగరం అంతా ఒకే చోట కలిసే హ్యాపీ సండే నగరవాసులకు ప్రతి ఆదివారం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే సైతం ఈ విషయంపై పర్యవేక్షణ చేసి ఎల్లప్పుడూ ఉండేలా పాలకవర్గానికి సూచనలు అందిస్తే బాగుంటుందని నగరవాసులు అడుగు అడగడం ఈ కార్యక్రమానికి ఎంతటి విశేషణ స్పందన వస్తుందో అర్థమవుతుంది.
- ఆసక్తిని పెంచుతున్న హ్యాపీ సండే
చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చేలా హ్యాపీ సండే కార్యక్రమం నగరంలో అందరి ఆసక్తిని పెంచుతుంది. ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆస్వాదించడం విశేషం.
ఏ కార్యక్రమం ప్రారంభించిన ఆ ఆ పార్టీకి సంబంధించిన వారే ఆసక్తికరంగా పాల్గొని ఆ తర్వాత ఆ ఏముందిలే అనే కార్యక్రమం కాకుండా చాలా మంచి అభిప్రాయంతో ఈ కార్యక్రమం ఎంతోమంది విద్యార్థుల తో పాటు పెద్దల లో ఉన్న నైపుణ్యాన్ని గురించి కార్యక్రమంగా అభివర్ణిస్తుండ్రు. దీంతో కార్యక్ర మాన్ని ఎల్లప్పుడూ ప్రతి ఆదివారం నిర్వహించేలా నూతన నగర కార్పొరేషన్ అడుగులు వేయాలంటూ ప్రజలు కోరడం నగరవాసుల ఆసక్తి ఎంతగా కావాలనుకుంటున్నారో ఉందో తెలుస్తుంది. తుది నిర్ణయం 99 రోజుల ముగింపు తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుందా తిరిగి ప్రతి ఆదివారం ఉండేలా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.






