1 July, 2026 | 6:50 PM

Breaking News

కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •  

టాలెంట్ టెస్ట్‌కు అనూహ్య స్పందన

17-03-2026 12:00 AM

ఐఐఎంసీ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహణ

ఖైరతాబాద్, మార్చి 16: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల (స్వయం ప్రతిపత్తి), శామీర్‌పేటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రుజ్ సంస్థ సంయుక్తంగా సోమవారం మేనేజ్మెంట్ టాలెంట్ టెస్ట్‌ను అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహించాయి. డిగ్రీ, పీజీ విద్యార్థులలో మేనేజ్మెంట్ అంశాలపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో “ మేనేజ్మెంట్ టాలెంట్ టెస్ట్‌”ను నిర్వహించారు.

ఇందులో 11 దేశాల నుంచి భారత దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 65 నగరాలలోని వివిధ కళాశాలలకు చెందిన 1,410 మంది విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన నవ శక్తి ( ఏవిపి కాలేజ ఆర్ట్స్ అండ్ సైన్స్, తిరుపూర్) మొదటి బహుమతిగా రూ. 5,000-, రామ్ చరణ్ తేజ (కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్  )

రెండవ బహుమతిగా రూ. 3,000-, సనం శివమణికంట  (కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, హైదరాబాద్) మూడవ బహుమతిగా రూ. 2,000-, అంగయార్ కన్ని (ఏవిపి కాలేజ ఆర్ట్స్ అండ్ సైన్స్, తిరుపూర్),  దిశా ఆత్మీయ యూనివర్సిటీ,రాజ్ కొట్), కృష్ణ తుశాంత్ (ఠాకూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ , ముంబై), రితిక్ రస్తోగి (ఈడి అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ,ఘజియబాద్), నమిత అన్ (సవిత ఇంజనీరింగ్ కాలేజ్, చెన్ను), నీలిమ ( కె ఎల్ యూనివర్సిటీ, విజయవాడ), శ్రీకర్ (భవన్స్ వివేకానంద కాలేజ్, హైదరాబాద్) 7 ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున  అందజేశారు.