17 August, 2026 | 4:00 AM

మండల స్థాయిలోనూ ప్రజావాణి

17-08-2026 12:00 AM

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల, ఆగస్టు 16: ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి మండల స్థాయిలో నూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తె లిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని తమ సమస్యలపై ఆర్జీలను సమర్పించాలని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నారు.

ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించడంతో పాటు ఆయా మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వి నతులను ప్రజావాణిలో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను పరిశీలించి నిర్దేశిత సమయంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. చిన్నచిన్న స మస్యల పరిష్కానికి కలెక్టరేట్ వరకు రాకుండా మండల స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.