09-05-2025 11:28:51 PM
మందమర్రి,(విజయక్రాంతి): పశువుల యజమానులు తమ పశువులు (ఆవులు, గేదెలు) పట్టణంలో యధేచ్ఛగా వదిలివేయకుండా, ఇంట్లోనే కట్టివేయాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కోరారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పశువులను రోడ్లపై వదిలి వేయడం వలన, అవి విచ్చలవిడిగా పట్టణ పురవీధులలో ప్రధాన రహదారులలో సంచరించడంతో పాదచారులు, వాహన దారులకు ప్రమాదాలు జరిగి, గాయాల పాలు అవడం, ప్రాణాపాయం జరుగుతుందని తెలిపారు. పశువుల యజమానులు 3 రోజుల లోపు తమ తమ పశువులను తీసుకుపోవాలని, లేని పక్షంలో వాటిని గోశాలకు తరలించడం జరుగుతుందన్నారు. పశువులను రోడ్లమీదకు విడిచి పెడితే మున్సిపాలిటీ తీసుకునే చర్యలకు పశువుల యజమానులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.