calender_icon.png 12 May, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

10-05-2025 12:00:00 AM

ఉస్మానియా బీఆర్‌ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య

ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి) : జాబ్ నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ  బీఆర్‌ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలసి పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10,954 జీపీఓ(గ్రామ పాలన ఆఫీసర్) పోస్టులను పాత విఆర్‌ఏ, వీఆర్‌ఓలతో భర్తీ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.

పాత విఆర్‌ఏ, వీఆర్‌ఓలతో లలో చాలా మంది టెన్త్, ఇంటర్ వారే ఉన్నారు కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న వారిని మాత్రమే తీసుకుని మిగతా ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని అనుకుంటే 10,954 జీపీఓ(గ్రామ పాల న ఆఫీసర్) పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలన్నారు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, రమేష్ గౌడ్, మధు, సైదులు, వెంకటేష్, మ ల్లేశం, విరేశలింగం తదితరులు పాల్గొన్నారు.