3 March, 2026 | 7:59 PM

ఈసీఐఎల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా పడిపూజ

30-11-2025 03:42 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని  ఈసీఎల్ కమలానగర్ లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మాదిరెడ్డి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో  18వ పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గణపతి హోమాలు అభిషేకాలు ఈలపాటి శ్రీనివాస్ రాజు గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తో పాటు  కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షులు వజ్రష్ యాదవ్ సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పాల్గొన్నారు.  అయ్యప్ప స్వామికి పంచామృతులతో అభిషేకం స్వామి స్మరిస్తూ భజన కీర్తనలు కమలానగర్ పరిసర ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ రేగళ్ల సతీష్ రెడ్డి ట్రెజరర్ శేఖరా చారి జాయింట్ సెక్రటరీ నిరంజన్  మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పావని రెడ్డి తదితరులు పాల్గొన్నారు