1 April, 2026 | 12:45 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

19న పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు సన్మాన సభ

17-06-2025 01:02 PM

వికలాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలి

విహెచ్పీఎస్  రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెరిక  శ్రీనివాసులు

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును పొందిన మంద కృష్ణ మాదిగ  కి ఈ నెల 19 హైదరాబాద్ లో వికలాంగుల ఆధ్వర్యంలో నాగోల్ శుభం గార్డెన్ లో  ఘన సన్మానం నిర్వహిస్తున్నట్లు  వికలాంగులు పెన్షన్ దారులు పెద్ద ఎత్తున కదలిరావాలని రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెరిక శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 14వ వార్డు  మర్రిగూడలో ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అత్యధికంగా వికలాంగులు పెన్షన్ పొందుతున్న రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు నిలిచిపోతున్నాయని అన్నారు.

దానికి కారణం ఈ రెండు రాష్ట్రాల్లో మందకృష్ణ మాదిగ నడిపిన ఉద్యమ ఫలితమే అని అన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు రాజకీయవేత్తలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ వికలాంగుల గురించి ఎవరు పట్టించుకోలేదన్నారు. మంద కృష్ణ మాదిగ వికలాంగులను ఏకం చేసి  సంఘాన్ని స్థాపించి పెన్షన్లు పెంచాలని పోరాటం చేయడం వల్లే ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. చిలుముల జలంధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు వీరబోయిన సైదులు యాదవ్, జిల్లా మాజీ కన్వీనర్ కోమ్ముహరికుమార్,  బీపంగి బుచ్చమ్మ, నల్ల పోతు పెద్దులు, బోజ్జ లింగయ్య, బోజ్జ జానయ్య, తదితరులు పాల్గొన్నారు.