calender_icon.png 17 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంప్రూవ్‌మెంట్ ఫలితాలలో వీఆర్‌కే విద్యార్థుల సత్తా

17-06-2025 01:37:38 AM

కామారెడ్డి, జూన్ 16 (విజయ క్రాంతి):   ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ ఫలితాలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విఆర్కే విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. నవోదయ బైపిసి ఫస్టియర్ విద్యార్థిని 440 కి గాను 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్ గా నిలిచారు. అదే విధంగా మిగిలిన విద్యార్థులు సైతం అంతకుముందు కంటే మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో వారి ప్రతిభను చాటారు.

ఈ సందర్భం గా విద్యార్థులను ఆర్కే సీఈవో డా|| జైపాల్ రెడ్డి  అభినందించారు. కామారెడ్డి ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులను సైతం ఉత్తమ విద్యతో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని, ఈ ఫలితాలకు సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందం , శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.  రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు సాధించి విద్యార్థులను ఉత్తమ పౌరులు గా తయారవ్వడంలో కృషి చేస్తామని అన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అందరిని పుష్పగుచ్చం, మేమoటోలతో సత్కరించారు. విద్యార్థులందరికీ మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శంకర్, డీన్ నవీన్, ఆధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.