17-06-2025 01:05:54 PM
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు
కోదాడ: కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్ రాష్ట్ర సరిహద్దులో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కొత్త పాత నాయకులు అంటూ తేడా లేకుండా అందరూ సమిష్టిగా కృషిచేసి వచ్చే ఎన్నికల్లో కోదాడ మండలం ఏకగ్రీవం అయ్యేలా కృషి చేయాలన్నారు.