calender_icon.png 24 May, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం, అబుజ్‌మాడ్ హత్యలపై న్యాయవిచారణ జరిపించాలి

24-05-2025 12:00:00 AM

ఆపరేషన్ కగార్, సింధూర్‌లో దాగి ఉన్న అసలు నిజాలు బహిర్గతం చేయాలని న్యూడెమోక్రసీ డిమాండ్ 

ఇల్లెందు టౌన్, మే 23 (విజయక్రాంతి):  పహాల్గామ్,అబుజు మాడ్ లపై న్యాయవిచారణ జరిపించాలని ఆపరేషన్ కగార్, సింధూర్ లో దాగి ఉన్న అసలు నిజాలను బహిర్గ తం చేయాలని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు.

సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఇ ల్లందులోని పెన్షనర్ల భవన్లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సదస్సు లో ఆయన పాల్గొని మాట్లాడారు. పహాల్గమ్ ప్రధానంగా పర్యాటకుల ప్రాంతమని, ఇక్కడికి అనేకమంది ప్రజలు విహార యాత్రలకు వస్తూ ఉంటారన్నారు.

కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాల లోపాల వల్ల పహల్గం దా డి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ పహల్గం దాడిని ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూనే 370 ఆర్టికల్ తర్వాత ఎలాంటి యు  ద్ధాలు ఉగ్రవాద చర్యలు ఉండవని ప్రకటించిన నరేంద్ర మోడీ ఈ పెహల్గాం దాడి ఎలా జరిగిందో చెప్పాలన్నారు.

163 దేశాల సభ్యత్వం కలిగిన యుఎన్‌ఓ లో చర్చించకుండా భారత పార్లమెంటులో చర్చించకుం డా ప్రతిపక్షాలతో చర్చించకుండా యుద్ధాని కి వెళ్లి వెనక్కి రావడంలో అంతర్వేమిటో నరేంద్ర మోడీ తెలపాలన్నారు. అకస్మాత్తుగా మే 7న యుద్ధాన్ని ప్రకటించి మే 10న అకస్మాత్తుగా యుద్ధాన్ని విరమించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇరుదేశాల ప్రజ ల శాంతి కోరుకుంటున్నామని యుద్ధం ప్రకటించిన దేశాలు నేడు మన దేశంలో ఉన్నటువంటి పౌరులని ఈ దేశ హక్కుల కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆదివాసీలను, నక్సలైట్లను ఎలా హతమారుస్తున్నా రని ఆయన ప్రశ్నించారు. 140 కోట్ల ప్రజల శాంతి కోరుకుంటున్నాం అని చెప్పే పాలకు లు శాంతి చర్చలకు వస్తామని చెప్పిన మా వోయిస్టుతో ఎందుకు శాంతి చర్చలు జరపడం లేదని ఆయన అన్నారు.

ఆపరేషన్ క గార్ ఆపరేషన్ సింధూరులో దాగి ఉన్న రహస్యాలని బహిర్గతం చేయాలన్నారు. ఇవ న్నీ కూడా ఆదివాసీల ఖనిజ సంపదను దోచుకుపోవడం కోసం ఆదివాసులను అం తమొందించడం కోసం జరిగే యుద్ధమే అని ఆరోపించారు. ఈ యుద్ధాలు, ఎన్కౌంటర్లు అన్నీ కూడా ఆదాని, అంబానీ కార్పొరేట్ శ క్తుల కోసమేనని గుర్తు చేశారు.

ఈ దాడుల ప్రారంభం జరిగిన తీరు కాల్పుల విరమణ ఒప్పందం వీటిలో సామ్రాజ్యవాద శక్తుల పాత్ర, విదేశీ శక్తుల పాత్ర ప్రజలు తెలుసుకోవాలని హత్యలపై ఆపరేషన్ పేరుతో జరుగుతున్న హత్యలపై అన్ని వాస్తవాలను బహిర్గతం చేయాలని సిపిఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కే. సా రంగపాణి, ఏఐటిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సూర్ణపాక నాగేశ్వరరావు, జిల్లా కన్వీనర్ మోకాళ్ల రమేష్, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జి ల్లా నాయకులు పొడుగు నరసింహారావు, తోడేటి నాగేశ్వరరావు, ల్తీ వెంకటేశ్వర్లు, ఎట్టి నర్సింహారావు, పూణెం రంగయ్య, బట్టు ప్రసాదు, హార్జ్య, యాసారపు వెంకన్న, మాజీ సర్పంచులు మోకాళ్ళ కృష్ణ, వాంకుడోత్ శ్రీను, అరుణోదయ జిల్లా కార్యదర్శి ఎనగంటి చిరంజీవి, పి వై ఎల్ రాష్ట్ర నాయకులు మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.