24-05-2025 12:00:00 AM
-ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి
-విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
-బీటీ- III ప్రత్తి విత్తనాలకు అనుమతి లేదు
కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 23(విజయ క్రాంతి): నకిలీ, నిషేధిత విత్తనాలపై ఉక్కుపా దం మోపుతామని, నిబంధనలు అత్రికమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే హెచ్చరించారు. శుక్రవారం కాగ జ్‌నగర్ పట్టణంలోని హిమాన్షు ట్రేడర్ ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించి స్టాక్ రిజిస్టర్, రసీదు పుస్తకాలు, ధరల పట్టిక, తూకం యం త్రం, విత్తన ప్యాకెట్లను పరిశీలించారు పరిశీలించి అక్కడి రైతులకు విక్రయిస్తున్న ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వంచే గుర్తించ బడిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని, విక్రయ సమయంలో సంబంధిత కంపెనీ పేరుతో రసీదు తప్పనిసరిగా కొనుగోలుదారుకు అందించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే షాపు లైసెన్స్ లను రద్దుచేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమో దు చేయడం జరుగుతుందని తెలిపారు. దుకాణంలో నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు.
అనంతరం పట్టణంలోని సత్యసాయి ఫర్టిలైజర్స్ షాపును తనిఖీ చేసి రైతులకు విక్రయిస్తున్న కంపెనీ విత్తనాల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశిం చిన ధరలకు మాత్రమే విత్తనాలను విక్రయించాలని, డివిజన్ లో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉండేలా, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతిరోజు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు, ఎడిఎ మనోహర్, తహసిల్దార్ కిరణ్, వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
అనుమతి లేని విత్తనాలను రైతులు కొనుగోలు చేయొద్దు: కలెక్టర్
ఆదిలాబాద్, మే 23 (విజయక్రాంతి) : విత్తన డీలర్లు నకిలీ ఎత్తనాలు అమ్మితే కఠిక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. వానా కాలం సీజన్ ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రం లోని ఆఖిల్ ఫర్టిలైజర్స్, రైతుమిత్ర ట్రెడర్స్ దుఖాణాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా ఆయా ఫర్టిలైజర్ షాపుల్లో ఉన్న పత్తి విత్తనాల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్టర్ లను సైతం పర్యవేక్షించారు.
ఈ మేరకు రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... ఈ వాన కాలనికి సరిపోయే ప్రత్తి, సోయా తదితర పంటల విత్తనాలు సంవృద్ధిగా ప్రతి డీలర్ల దగ్గర అందుబాటు లో ఉంచటం జరిగిందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, దళారులను నమ్మి మోసపోకూడదని సూచించారు. విత్తన డీలర్లలు తప్ప నిసరిగా రశీదులు ఇవ్వాలని, విధిగా లాట్ నెంబర్ కూడా రాయాలని ఆదేశించారు.
రైతులు సైతం బీటీ- III ప్రత్తి విత్తనాలకు అనుమతి లేదనీ, ఆదేవిధంగా లూజ్ (కుల్లా) గా విత్తనాలు కొనకూడదని తెలియజేశారు. పంట చివరిదాకా విత్తన బ్యాగ్ రశీదు లను భద్రపరించుకోవాలని సూచించారు. గ్లఫో సెట్ గడ్డి మందుకు అనుమతి లేదని దానిని కూడాకోనుగోలు చేయరాదని, ఎరువుల డిలర్లు ఈ మషిన్ ద్వారా మాత్రమే ఎరువులు అమ్మాలని, సరిపడేంతగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆందోళ న చెందకూడదని కోరారు. డీలర్లుపై నిఘా ఉంటుందని, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు తనిఖీలు సైతం చేస్తున్నారని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వినోద్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర స్వామి ఉన్నారు.