23-05-2025 11:55:08 PM
హుండీ పగలగొట్టి బంగారం డబ్బులు కాజేసిన దుండగులు
కోదాడ: కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామ శివారులో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో హుండీలో చోరీకి పాల్పడ్డారు. విలువైన నాలుగు బంగారు పుస్తెలు, హుండీలో ఉన్న సుమారు పదివేల రూపాయలు దొంగలించారు. విషయం తెలుసుకున్న గుడి చైర్మన్ యాద గురునాథం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ రాజా అన్నారు.