12 April, 2026 | 1:08 AM

భారీ స్కోరు చేసిన పాక్

23-12-2024 12:03 AM

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ఓపెనర్ ఆయుబ్ (101) సెంచరీతో మెరిశాడు. బాబర్ ఆజమ్, రిజ్వాన్ అర్ధ సెంచరీలు చేయగా.. ఆఘా సల్మాన్ (48) పరుగులు చేశాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన పాక్ సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది.